Thursday, November 1, 2012

సంపూర్ణం, దాదాపుగా

నీకు తెలుసు, మృత్యువు అనేది లేనే లేదు, అన్నాడు అతను ఆమెతో.
అవును -ఇప్పుడు నేను చేనిపోయి ఉన్నాను కాబట్టి-
నాకా విషయం తెలుసు: అని జవాబిచ్చింది  తను.  చూడూ
చక్కగా ఇస్త్రీ చేసిన నీ రెండు షర్టులూ అలమరలో ఉన్నాయి.
నా వద్ద లేనిదల్లా ఏమిటంటే
నీకు అమర్చేందుకు లేని ఓ 

చిన్ని గులాబీయే-

Completeness Almost by Yannis Ritsos. 

Wednesday, October 31, 2012

చీకటి పడే దాకా

ఆమె చేతిని అతడు, తన చేతిలో పొదివి పుచ్చుకున్నాడు.
ఇకా తరువాత అతనేమీ మాట్లాడలేదు.

సుదూరంగా ఎక్కడో, బహుశా తనలోనే అతడు
అప్పుడు ఒక విస్త్రుతమైన సముద్రపు
హృదయ నాదాన్ని విన్నాడు. ఇవే మరి

సముద్రమూ, పైన్ వృక్షాలూ, ఆ శిఖరాలూ...
ఇవన్నీ తన చేతులే

మరి అలా అని అతడు ఆమెకు కనుక చెప్పకపోతే
ఎలా పొదివి పుచ్చుకోగలడు, తన చేతిని? ఇక ఆ     
తరువాత, చీకటి పడే వరకూ వాళ్ళిద్దరే అక్కడ నిశ్చలంగా

విరిగిపోయిన చేతులతో ఆ విగ్రహమొక్కటే
ఆ చెట్ల కింద---

Until it Turned Dark by Yannis Ritsos.